108 సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

X
By - TV5 Telugu |6 April 2020 6:48 PM IST
108 సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. సూర్యపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్వపల్లి గ్రామ సమీపంలో 108 వాహనంలో విధులు నిర్వహిస్తున్న ఈఎంటీ నిరంజన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ హాస్పటల్‌కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com