గోఎయిర్ కీలక నిర్ణయం.. ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్

ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గోఎయిర్ ప్రతినిధి వార్త సంస్థ ANI కి నివేదించారు. గోయిర్ సంస్థ 15 ఏప్రిల్ 2020 నుండి దేశీయ విమానాల్లో ప్రయాణానికి సంబంధించి బుకింగ్ ప్రారంభిస్తుందని.. అంతర్జాతీయ విమానాల బుకింగ్.. మే 1 నుండి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. గత వారం, భారతదేశ జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా ఏప్రిల్ 30 వరకు అన్ని విమానాల కోసం ముందస్తు బుకింగ్లను నిలిపివేసింది.
కరోనావైరస్ యొక్క వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్డౌన్ మార్చి 25 నుండి కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దాంతో దేశీయ విమానాలు ఆగిపోయాయి, కానీ అంతకు ముందే చాలా విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి.. దీనికి కారణం ప్రయాణికులు లేకపోవడమే. ఈ క్రమంలో గోఎయిర్ సంస్థ లాక్ డౌన్ తరువాత రోజు బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించడం కీలక పరిణామంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com