కన్నడ హాస్య నటుడు బుల్లెట్ ప్రకాష్ మృతి

ప్రముఖ కన్నడ హాస్య నటుడు బుల్లెట్ ప్రకాష్ (44) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ఇటీవల బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, ఆ తరువాత అతన్ని వెంటిలేటర్ మీద ఉంచారు. ఆరోగ్యం మరింతగా విషమించి ఇవాళ మృతిచెందారు. వైద్యులు అతనికి గ్యాస్ట్రిక్ మరియు కాలేయ సంక్రమణ ఉన్నట్లు నిర్ధారించారు. అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా 35 కిలోలు తగ్గిపోయారు.. అంతేకాదు ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీసిందని చెప్పారు వైద్యులు.
అనారోగ్యం కారణంగా దాదాపు మూడు నెలలుగా ఆయన ఏ సినిమాల షూటింగ్ లలో పాల్గొనలేదు. పాపులర్ రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ రెండవ సీజన్లో కూడా పాల్గొన్నారు ప్రకాష్. కన్నడ చిత్ర పరిశ్రమలోని అగ్ర నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రకాష్‌ను బుల్లెట్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన తరచుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను నడుపుతూ కనిపిస్తాడు. 300 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన 2015 లో భారతీయ జనతా పార్టీలో చేరారు. కాగా ప్రకాష్ ఈరోజు ఆకస్మిక మరణం కన్నడ చిత్ర పరిశ్రమను షాక్ కు గురిచేసింది. ఆయనకు పలువురునివాళి అర్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com