7 April 2020 3:39 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / మంత్రిగారు మాటలు...

మంత్రిగారు మాటలు మాత్రమే చెప్తారు.. రూల్స్ అతిక్రమించి..

మంత్రిగారు మాటలు మాత్రమే చెప్తారు.. రూల్స్ అతిక్రమించి..
X

కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలమవుతోంది. ఇంట్లో కూర్చోడం మినహా చేసేదేం లేదని చెవినిల్లు కట్టుకుని మరీ చెబుతోంది. ఇంట్లోనే కూర్చుని ఏడవండ్రా బాబూ అంటే.. మాకు బయట బోల్డు పనులున్నాయంటూ బండ్లూ, కార్లు తీస్తున్నారు. వాళ్లు బయటకు రావడం పోలీసులు వాళ్లకు క్లాసులు పీకడం.. కామనైపోయింది. మళ్లీ యధామామూలే. సామన్యుడంటే వినట్లేదు.. మరి ఆర్థిక మంత్రిగారు కూడా అలా చేస్తే ఎలా.. ప్రజలకు చెప్పాల్సిన పెద్దలే రూల్స్ అతిక్రమిస్తే..

న్యూజిలాండ్‌కు చెందిన ఆర్థిక శాఖ మంత్రి డేవిడ్ క్లార్క్ లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి ఫ్యామిలీ ఫ్యామిలీ కార్లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రానికి వెళ్లారు బీచ్ అందాలను ఆస్వాదించడానికి. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెన్ కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ నియమావళిని ఉల్లంఘించి ఆర్థిక మంత్రి ప్రజల నుంచి చీవాట్లు తిన్నారు. వెంటనే మేల్కొన్న మంత్రి ప్రజలకు సారీ చెబుతూ తన తప్పుని ఒప్పుకుని, మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా.. నేనో ఇడియట్‌ని అని తనని తాను నిందించుకున్నారు.

Next Story