అమెరికాలో లాక్‌డౌన్ ఎందుకు లేదు!!

అమెరికాలో లాక్‌డౌన్ ఎందుకు లేదు!!

పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఎక్కువవుతోంది. అయినా అమెరికాలో లాక్‌డౌన్ ప్రకటించకపోవడం ఆశ్చర్యకరం. కానీ చాలా రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఎక్కువగా ఉన్నందున కోవిడ్‌ను కట్టడి చేయలేకపోతున్నామని అమెరికాలో నివసిస్తున్న భారతీయ డాక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. దీనికితోడు ఔషధాల కొరత, కేసుల నిర్ధారణ పరీక్షల్లో జాప్యం ఇవన్నీ కలిసి కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయని అన్నారు.

ఒక్క న్యూయార్క్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఒకటి, రెండు సమయం పడుతుందని ఆయన అన్నారు. మొదట్లో మాస్కుల కొరత కారణంగా ఒకే మాస్కును నాలుగైదు రోజులు వాడాల్సి వచ్చిందని అన్నారు. భారత్ లాక్‌డౌన్ విధించి మంచి పని చేసిందని ఆయన అన్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు లేనందున భారత్ కరోనా విజృంభిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. అయితే అమెరికాలో ఈ తరహా చర్యను చేపట్టకపోవడానికి కారణం.. ప్రస్తుత సీజన్‌లో లక్షలాది మంది పర్యాటకులు అమెరికాను సందర్శిస్తారు.

లాక్‌డౌన్ విధిస్తే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది. దాంతో రాబడి తగ్గి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని భావించిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడానికి వెనుకాడుతోందని అన్నారు. అమెరికాలో ఒక్క కరోనా కేసు కూడా లేని స్థితి రావడానికి కనీసం నెల రోజులు పడుతుందని, అదే భారత్‌లో అయితే ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్ వంటివి అమలు పరచకపోతే మే చివరి నాటికి కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని అన్నారు. వీలైనంత వరకు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఎవరిని వారు కాపాడుకోవలసిన పరిస్థితి అని ఆయన వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story