మా విజ్ఞప్తిని మన్నించకపోతే భారత్ పని చెప్తా: ట్రంప్

మా విజ్ఞప్తిని మన్నించకపోతే భారత్ పని చెప్తా: ట్రంప్

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతోంది. మృతుల సంఖ్య పెరగడం, పాజిటివ్ కేసులను గుర్తించడం అధినేత ట్రంప్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. దీనికి వ్యాక్సిన్‌ కానీ, మందులు కానీ లేకపోవడంతో హైడ్రాక్సిక్లోరోక్విన్‌పై ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. అమెరికా ఇప్పటికే 29 మిలియన్ డోసుల మేర ఈ మందును స్టోర్ చేసి పెట్టుకుంది. అయినా ఇంకా భారత్‌ను అర్థిస్తోంది. అయితే కరోనా చికిత్సలో ఉపయోగపడే మందులపై భారత్ నిషేధం విధించింది. మరి ట్రంప్ సూచనను భారత ప్రధాని మోదీ తిరస్కరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఈ మందులపై నిషేధం ఎత్తివేయకపోతే ప్రతీకారం తీర్చుకోవలసి వస్తుంది. ఈ విషయంలో మేమెందుకు మౌనం దాల్చాలని సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరులసమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఔషధరంగంలో భారత్‌కు.. అమెరికా ప్రధాన భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న విషయాన్ని యూఎస్ విదేశాంగ శాఖలోని ఉన్నతాధికారి అలైన్స్ జీ వెల్స్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, కరోనా రోగులకు, అనుమానితులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి, వారి బంధువులకు ఈ మందును ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలి సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story