8 April 2020 4:02 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / కోవిడ్ -19 గ్లోబల్...

కోవిడ్ -19 గ్లోబల్ కేసులు.. 1.5 మిలియన్లకు దగ్గరగా

కోవిడ్ -19 గ్లోబల్ కేసులు.. 1.5 మిలియన్లకు దగ్గరగా
X

కరోనావైరస్ సంక్షోభంపై దేశవ్యాప్తంగా లాక్డౌన్ 15 వ రోజులోకి భారత్ ప్రవేశించింది, ప్రస్తుతం దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 5,194 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో వైరస్ కారణంగా 149 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కోవిడ్ -19 గ్లోబల్ కేసులు 1.5 మిలియన్లకు చేరుకోబోతున్నాయి, అలాగే మరణాల సంఖ్య 80,000 దాటింది. మహమ్మారికి కేంద్రంగా ఉన్న వుహాన్, హుబీ నెమ్మదిగా తన 11 వారాల లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది. యుఎస్ 4 లక్షల మంది కోవిడ్ -19 బారిన పడ్డారు.. అలాగే 200 కు పైగా కొత్త మరణాలను నమోదు చేసింది.

Next Story