అంతర్జాతీయం

అమెరికాలో కరోనా కాటుకు బలైన భారత సంతతికి చెందిన జర్నలిస్ట్..

అమెరికాలో కరోనా కాటుకు బలైన భారత సంతతికి చెందిన జర్నలిస్ట్..
X

అమెరికాలో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన బ్రహ్మ కంచిబొట్ల (66)ను కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. 28 ఏళ్టుగా ఆయన పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయనకు మార్చి 23న కరోనా సోకింది. దాంతో ఆయన గృహనిర్భంధంలో ఉన్నారు. మార్చి 28 నాటికి వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు అతడిని లాంగ్ ఐస్‌లాండ్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. మార్చి 31న నాటికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో వైద్యులు ఆయన్ను వెంటిలేటరపైకి మార్చారు. ఏప్రిల్6న పరిస్థితి మరింత విషమించి బ్రహ్మ తుది శ్వాస విడిచారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తారో లేదోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన కుమారుడు. బ్రహ్మకు భార్య అంజన, కూతురు సుజన, కుమారుడు సుడామా ఉన్నారు.

Next Story

RELATED STORIES