పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుత దృశ్యాలు

పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుత దృశ్యాలు

మంగళవారం రాత్రి ఆకాశంలో చంద్రుడు కనువిందు చేశాడు. చంద్రుడిలో భారీ మార్పులు కన్పించాయి. పౌర్ణమి రోజు సాధారణంగా కనిపించే దాని కంటే ఆకారంలో 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా దర్శనమిచ్చాడు. దీన్ని పింక్‌ సూపర్‌ మూన్‌గా ఖగోళ శాస్త్రవేత్తలు అభివర్ణించారు.

అయితే ఏప్రిల్ 8న ఉదయం 8.05కి చందమామ భూమికి ఇంకా అత్యంత దగ్గరగా వస్తుంది. అవును.. చంద్రుడు భూమికి 221,772 మైల్స్ (356,907 కిలోమీటర్స్) దూరంలోంచి కనిపించనున్నాడు. 2020లో మొత్తం నాలుగుసార్లు సూపర్ మూన్ కనిపించనుండగా.. ఈ ఏడాది మొత్తంలో చంద్రుడు ఇలా ఇంత పెద్దగా కనిపించడం మాత్రం ఈ ఒక్కసారే జరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story