డాక్టర్ సుధాకర్ రావు సస్పెన్షన్ తక్షణమే ఎత్తి వేయాలి : చంద్రబాబు
సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరో లేఖ రాశారు. ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనుల వల్ల, వైద్యులు, సిబ్బంది మనోధైర్యం దెబ్బతింటుందని అన్నారు. నర్సీపట్నం వైద్యశాలలో డాక్టర్ సుధాకర్ రావు సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తి వేయాలని కోరారు. రక్షణ పరికరాలు అందుబాటులో లేఖ సిబ్బంది పడుతున్న ఇబ్బందిని సుధాకర్ రావు వ్యక్తం చేశారని అన్నారు. మాస్కులు, గ్లౌజులు అడిగిన పాపానికి డాక్టర్ ను సస్పెండ్ చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో కూడా నలుగురు వైద్య సిబ్బంది కరోనా భారిన పడ్డారని గుర్తు చేశారు చంద్రబాబు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ రావు వ్యాఖ్యల్ని సానుకూలంగా చూడాలే తప్ప ప్రతికూల చర్యలు తగవని హితవు పలికారు. క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నవారికి రక్షణ ఉపకరణాలు అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి తప్ప సస్పెన్షన్ లు సమస్యకు పరిష్కారం కావని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com