జేసీ దివాకర్ రెడ్డితో సీఎం రమేష్, బీటెక్ రవి భేటీ

జేసీ దివాకర్ రెడ్డితో సీఎం రమేష్, బీటెక్ రవి భేటీ

టీడీపీ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి రహస్యంగా భేటీ అవ్వడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు వద్ద దివాకర్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ భేటీ జరిగింది. సుమారు రెండు గంటలపాటు ఫామ్ హౌస్ లో చర్చలు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జేసీని బీజేపీలోనికి ఆహ్వానించడానికే ఇద్దరూ వచ్చి ఉంటారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని ఇందులో రాజకీయాలు లేవని జేసీ దివాకర్ రెడ్డి తేల్చేశారు. తాను వ్యవసాయ తోటలో ఉన్నందునే కలవటానికి వచ్చారని జేసీ స్పష్టం చేశారు. పాత స్నేహితులు కాబట్టే కలిశామని చెప్పారు.

Tags

Next Story