గుంటూరు జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. ఇప్పటికే జిలాల్లో కేసుల తీవ్రత 41 కి చేరుకుంది. గుంటూరు నగరంలోనే 27 కేసులు నమోదు కావడం.. మంగళవారం ఒక్కరోజే 8 కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గుంటూరులోని 15 ప్రాంతాల్లో రెడ్ జోన్ గా ప్రకటించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైనా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోపక్క గుంటూరు జిల్లా వ్యాప్తంగా కేసులు తీవ్రత పెరగడంతో సహాయం చెయ్యడానికి స్వచ్చంధ సంస్థల వారికి కూడా కష్టతరంగా మారింది. ఇదిలావుంటే ఏపీలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 329 కి చేరుకుంది అత్యధికంగా కర్నూల్ జిల్లాలో అధిక కేసులు నమోదు అయ్యాయి.

Tags

Next Story