సాధ్యమైనంత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం: మోదీ

సాధ్యమైనంత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం: మోదీ
X

కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్ తరపున సాధ్యమైనంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ తెలిపారు. కరోనా విజృంబిస్తున్న వేళ హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి.. ప్రపంచదేశాలకు దేశాలకు పంపించేందుకు భారత్ సిద్ధమైంది. అటు.. అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీకి ట్రంప్.. ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

ట్రంప్ ట్వీట్ కి స్పందించిన మోదీ.. ఇలాంటి పరిస్థితులు మిత్రులను మరింత దగ్గర చేస్తాయని అన్నారు. భారత్-అమెరికా బంధం ఎప్పటికీ దృఢంగా ఉంటుందని.. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్ తరపున సాధ్యమైనంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

Tags

Next Story