అమెరికాలో 24 గంటల్లో దాదాపు 2 వేల మంది మృతి!

అమెరికాలో 24 గంటల్లో దాదాపు 2 వేల మంది మృతి!

అమెరికాలో కరోనావైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కరోనావైరస్ బారిన పడిన దాదాపు 2 వేల మందిమరణించారు, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ఈ వివరాలను వెల్లడించింది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,939 మంది మరణిసంచారని.. దాంతో అమెరికా అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 12,722 గా ఉందని తెలిపింది. ప్రస్తుతం మరణాల సంఖ్యలో అమెరికా మూడో స్థానంలో ఉంది.

17,127 మరణాలతో ఇటలీ మొదటి స్థానంలో ఉంది.. ఆ తరువాత స్పెయిన్ లో 13,798 మంది మరణించారు. ఇక అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కేసుల సంఖ్య 4 లక్షల 30 వేలకు దాటింది. ఇందులో కోలుకున్న వారు 22,891 మంది ఉన్నారు. అమెరికాలో అత్యధికంగా న్యూయార్క్ రాష్ట్రం ఉంది. ఇక్కడ 151.171 మంది వైరస్ భారిన పడితే.. అందులో 6.268 మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story