ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి.. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. 4జీ సేవల పునరుద్ధరణపై ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ అనే ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టగా.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా పిటిషనర్ తరపు లాయర్ హుజెఫా అహ్మది వాదనలు వినిపించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ను 4జీ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయాలని అహ్మది నివేదించారు. ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంటేనే ప్రజలకు సమాచారం అందుబాటులో ఉంటుందని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో 4జీ సేవలపై నిషేధం ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు ఇంకా కొనసాగుతూనే ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com