ఉత్తరప్రదేశ్ లోని ఈ 15 జిల్లాల్లో సర్వం మూసివేత..

ఉత్తరప్రదేశ్ లోని ఈ 15 జిల్లాల్లో సర్వం మూసివేత..
X

ఉత్తరప్రదేశ్ లో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి ఉదృతమవుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 జిల్లాల్లోని కోవిడ్ -19 హాట్‌స్పాట్‌లను పూర్తిగా మూసివేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆర్డర్ నిన్న 12 గంటల పూర్తిస్థాయి కర్ఫ్యూ అమల్లోకి వచ్చి ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ జిల్లాల్లో అన్ని అవసరమైన సేవలు డోర్ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టారు. అంతేకాదు ఎవరినీ బయటకు వెళ్ళడానికి అనుమతించరు.. అలాగే వేరే వారు కూడా రావడానికి అనుమతి లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అలాగే కర్ఫ్యూ పాస్‌లను కూడా సమీక్షిస్తామని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ తివారీ తెలిపారు. హాట్‌స్పాట్‌లు మూసివేయబడే 15 జిల్లాల్లో లక్నో, ఆగ్రా, ఘజియాబాద్, గౌతమ్ బుద్ నగర్ (నోయిడా), కాన్పూర్, వారణాసి, షామ్లీ, మీరట్, బరేలీ, బులంద్‌షహర్, ఫిరోజాబాద్, మహారాజ్‌గంజ్, సీతాపూర్, సహారాన్‌పూర్ ఉన్నాయి. ఆగ్రాలో 22 హాట్‌స్పాట్‌లు, ఘజియాబాద్‌లో 13 హాట్‌స్పాట్‌లు, లక్నో, నోయిడా, కాన్పూర్‌లో 12 హాట్‌స్పాట్‌లు, మీరట్‌లో ఏడు, మీనట్‌లో ఏడు, నాలుగు హాట్‌స్పాట్‌లను వారణాసి, సహారాన్‌పూర్, మహారాజ్‌గంజ్‌లో ఒక్కొక్కటి, షామ్‌లీ, బులాంద్‌షద్ర్‌లో మూడు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

Tags

Next Story