ఏపీలో కొత్తగా 15 కరోనావైరస్ కేసులు

X
ఏపీలో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఈరోజు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో ప్రకాశం లో 11, గుంటూరు లో 2 , తూర్పు గోదావరి మరియు కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 15 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 363 కి పెరిగింది. నిన్న సాయంత్రం వరకూ కొత్త కేసులు నమోదు కాలేదు..
దాంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని అనుకున్నారంతా.. అయితే ఒక్కసారిగా 15 కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. విశాఖపట్నం 20, తూర్పు గోదావరి 12, పశ్చిమ గోదావరి 22, కృష్ణా 35, గుంటూరు 51, ప్రకాశం 38, నెల్లూరు 48, కడప 29, కర్నూల్ 75, చిత్తూరు 20, అనంతపురం 13 గా నమోదయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
