ఆంధ్రప్రదేశ్

మా వాళ్లను ఆదుకోండి.. గుజరాత్ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ

మా వాళ్లను ఆదుకోండి.. గుజరాత్ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ
X

గుజరాత్ లో ఇరుక్కుపోయిన తెలుగువారిని ఆదుకోవాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాలకు లేఖ రాశారు. శ్రీకాకుళం, విజయనగం, విశాఖ జిల్లాలకు చెందిన 4000 మంది జాలర్లు గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో చిక్కుకున్నారని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. లాక్‌డౌన్ ముగిసేవరకు వారికి గుజరాత్ వసతి కల్పించి.. నిత్యవసరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

వారి యోగక్షేమాల పట్ల కుటుంబసభ్యులు ఎంతో ఆందోళనతో ఉన్నారని.. వారికి వైద్య సౌకర్యాలు అందించాలని చంద్రబాబు వివరించారు.

Next Story

RELATED STORIES