కరోనా కు ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం

కరోనా కు ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి అంతుచూస్తామని ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వవిద్యాలయం అంటోంది. కరోనాకు విరుగుడు వ్యాక్సిన్ ను తయారు చేయడంలో ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వవిద్యాలయం తలమునకలైంది.. ప్రయోగానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది.. కరోనా వ్యాధికి రాబోయే ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ తయారు చేస్తామని ఆక్స్‌ఫ‌ర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పరిశోధనలు దాదాపు పూర్తి అయ్యాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఈ వ్యాక్సిన్ ను మూడవ దశ ట్రయల్ తరువాత కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ తయారవుతుందని చెప్పారు. 2020 సెప్టెంబరు, డిసెంబరు మధ్య తొలి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచే అవకాశం ఉందని బ్రిటన్‌ చీఫ్‌ సైంటిఫిక్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story