ఏపీలో పిడుగులు.. ఐదుగురు మృతి

ఏపీలో పిడుగులు.. ఐదుగురు మృతి

ఏపీలో గురువారం ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కురిసిన భారీ వర్షానికి చేతికి వచ్చిన పంటలు నేలపాల‌య్యాయి. ఇక నెల్లూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులుప‌డి ఐదుగురు మరణించారు. దగదర్తి మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. అదేవిధంగా బోగోలు మండలంలో పిడుగుప‌డి 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అల్లూరు మండలంలో 54 ఏళ్ల వ్యక్తి పిడుగుపాటుకు బ‌ల‌య్యాడు.

Tags

Next Story