హైదరాబాద్‌లో వడగండ్ల వానలు పడే అవకాశం!

X
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఓ మోస్తరు నుంచి వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం పడింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
