వొడాఫోన్ ఐడియా కస్టమర్లు పక్క వారికి సాయం చేస్తే..

వొడాఫోన్ ఐడియా కస్టమర్లు పక్క వారికి సాయం చేస్తే..
X

తమ సేవలు ఉపయోగించుకుంటున్న కస్టమర్లకు మరో అవకాశాన్ని అందిస్తోంది వొడాఫోన్ ఐడియా. లాక్డౌన్ వేళ ప్రజలందరూ ఇళ్లలోనే ఉన్నందున రీఛార్జ్ ఫర్ గుడ్ అని ఒక పథకాన్ని లాంఛ్ చేసింది. ఈ పథకంలో భాగంగా ఇతర ప్రీపెయిడ్ కస్టమర్లకు ఆన్‌లైన్ రీచార్జ్ చేస్తే కమీషన్ అందివ్వనుంది. ఇలా వేరేవారికి చేసిన రీచార్జిపై ఏకంగా 6 శాతం క్యాష్ బ్యాక్‌ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉంటుందని సంస్థ తెలిపింది. ఇది ప్రతి వొడాఫోన్, ఐడియా కస్టమర్లకు వర్తిస్తుందని తెలిపింది.

Tags

Next Story