మా అంతర్గత వ్యవహారాల్లో చైనా తలదూర్చొద్దు: భారత్

ఐక్యరాజ్య సమితిలో చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ ఘాటుగా బదులిచ్చింది. జమ్మూ కశ్మీర్ అంశంపై చైనా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ ఇప్పుడూ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని..విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత మిషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో కశ్మీర్ అంశం ఇప్పటికీ ముందు వరసలో ఉందని.. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులను చైనా ఎప్పటికప్పుడు గమనిస్తోందని అన్నారు. అయితే.. చైనా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శ్రీవాస్తవ.. వాటిని మేము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కశ్మీర్ అంశంపై భారత్ ఎప్పుడూ ఒకే మాట మీద ఉందని చైనాకు బాగా తెలుసు. ఆ ప్రాంతం ఇప్పుడూ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. దానికి సంబంధించినవన్నీ భారత్ అంతర్గత వ్యవహారాలు. చైనాతో సహా ఇతర దేశాలు ఈ అంశంలో తలదూర్చకుండా ఉండాలని ఆశిస్తున్నామని చైనాకు గట్టిగా బదులిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com