హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో కంటైన్‌మెంట్ క్లస్టర్లు

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో కంటైన్‌మెంట్ క్లస్టర్లు

కరోనా నియంత్రణలకు కఠిన చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో సహా హై రిస్క్ ఉన్న 15 ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా మార్చింది. నగరంలో 175 కరోనా కేసులుండగా 12 ప్రాంతాల్లోనే 89 మంది వైరస్ భారిన పడ్డారు. దీంతో ఈ ప్రాంతాల్లో ప్రతి ఇంటిని వైద్య అధికారులు తనిఖీ చేస్తున్నారు. సర్వే చేసి వ్యాధి లక్షణాలున్న వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కి చేరింది. అలాగే కరోనాతో 12 మంది మృతి చెందారు. కరోనా నుంచి 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story