తెలంగాణలో అంతకంతకూ పెరుగుతోన్న కరోనా కేసులు

తెలంగాణలో కోవిడ్ మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 16 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 487 కు చేరింది. తెలంగాణాలో ఇప్పటివరకూ 12 మంది మృతి చెందగా మొత్తం 48 మంది పేషంట్లు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క హైదరాబాద్ లోనే 200 కేసులు నమోదు అయ్యాయి. దీంతో నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 430 యాక్టీవ్ కేసులు ఉన్నాయని.. వారందరికీ వివిధ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో 34 , మేడ్చల్ జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల్లో సగానికి పైగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నమోదైనట్టు తాజా బులిటెన్ లో వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com