కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగులను భారీగా తగ్గిస్తూ..

కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగులను భారీగా తగ్గిస్తూ..

ప్రపంచ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతోన్న కరోనా వలన ఆదేశ ఆర్థిక వ్యవస్థలు కూడా బాగా దెబ్బతింటున్నాయి. కొన్ని దేశాల్లో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌లో ఈ వైరస్ కారణంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 56 లక్షల మంది ఉద్యోగులలో కొంత మంది తమ ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని న్యూ ఎకనామిక్స్ ఫౌండేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు మూతపడిన కారణంగా 16లక్షల మంది రోడ్డున పడ్డారు. అయితే ఇలా రోడ్డున పడ్డ నిరుద్యోగులను ఆదుకుంటామని చెబుతోంది బ్రిటన్ సర్కారు. ఇందుకోసం 312 లక్షల కోట్ల రూపాయలతో ఓ స్కీమ్ ప్రవేశపెట్టింది. అయితే కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఈ నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెబుతోంది. జూన్ తరువాత కూడా పరిస్థితులు ఇలాగే కొనసాగితే అప్పుడు ప్రభుత్వం తిరిగి పునర్విచారణ చేపడుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story