వాళ్లలా తిట్టకపోతే నేనింకా..

చిన్నప్పుడే చిన్నారి పెళ్లి కూతురుతో ఎంట్రీ ఇచ్చి బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించింది అవికాగోర్. ఇక పెద్దయ్యాక ఉయ్యాల జంపాలతో తెలుగమ్మాయేనేమో అనిపించేలా నటించి మెప్పించింది. ఆ చిత్రం హిట్టయినా ఆశించినంతగా తరువాత ఆఫర్లు రాలేదు ఆమెకి. ముద్దుగా, బొద్దుగా ఉన్న అవికా ఈ మధ్య స్లిమ్‌గా తయారయ్యేసరికి.. సన్నజాజితీగలా అలా ఎలా సాధ్యమైందీ అంటే.. నా బద్దకమే నా బరువు పెరగడానికి కారణం. ఓ ఫంక్షన్‌కి స్కర్ట్ వేసుకుని వెళ్లాను. ఆ డ్రెస్‌లో నన్ను చూసి ఫ్రెండ్స్ తిట్టారు. బరువు తగ్గకపోతే బాగోదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఆ మాటల్ని సీరియస్‌గా తీసుకున్న నేను నా బరువుపై దృష్టి పెట్టి వర్కవుట్లు చేశాను. దాంతో దాదాపు పన్నెండు కిలోలు బరువు తగ్గాను. ఇప్పుడు నాపై నాకు నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరిగాయి. వాళ్లలా తిట్టి వుండకపోతే నేను అలా లడ్డూ లానే ఉండాల్సి వచ్చేది. ఒకందుకు ఆ తిట్లే నాలో ఈ మార్పుకు కారణమయ్యాయి.. వాళ్లందరికీ నా ధన్యవాదాలు అని అవికా గోర్ చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడైనా ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com