అగ్రరాజ్య అధ్యక్షుడు తీసుకోబోయే అతి పెద్ద నిర్ణయం..!!

అగ్రరాజ్య అధ్యక్షుడు తీసుకోబోయే అతి పెద్ద నిర్ణయం..!!

కరోనా వైరస్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. రోజు రోజుకి మృతుల సంఖ్య పెరగడం.. పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువవడం.. మరోవైపు ఆర్ధిక వ్యవస్థ కుదేలవడం అధినేతను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మరి కొద్ది రోజులు ఇలాగే ఉంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్ లేకపోయినా ప్రజలందరూ అప్రమత్తమై సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎక్కువ శాతం ఇళ్లకే పరిమితమయ్యారు.

వైరస్ కారణంగా విధించిన ఆంక్షల్ని ఎప్పుడు సడలించాలన్నదానిపై అధినేత స్పష్టమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. అయితే ఆంక్షల్ని ఎత్తివేయడం అనేది తాను జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయాల్లో ఇది ఒకటి కాబోతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా జనాభాలో దాదాపు 95 శాతం మంది ఆంక్షల అమలులో జీవిస్తున్నారు. ఆంక్షల ఎత్తివేత నిర్ణయంలో నిపుణుల సూచనలు, సలహాలు పాటిస్తామంటున్నారు.

కాగా, అమెరికాలో ఇప్పటి వరకు ఐదు లక్షల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 18,763 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 7,847 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఉన్న విదేశీయులు వారి వారి స్వస్థలాలకు వెళ్లకుండా తాత్సారాం చేయడాన్ని అధ్యక్షుడు తప్పు పడుతున్నారు.

ఇకపై విదేశాల నుంచి అమెరికా వచ్చే పౌరులకు విసా నిరాకరిస్తామని హెచ్చరిస్తున్నారు. అమెరికా పౌరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్పి వస్తుందని ఆయన అన్నారు. వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆంక్షలు అమలు పరచవలసి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story