భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..

భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి.. గురువారం దేశవ్యాప్తంగా 896 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని, మహమ్మారి బారినపడి 37 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఇప్పుడు మొత్తం 6,872 కరోనావైరస్ కేసులు ఉన్నాయి.. అంతేకాదు మొత్తం 206 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా 1300 కేసులు నమోదైనట్టు తెలిపారు. కాగా పెరుగుతున్న కరోనా కేసులు, లాక్ డౌన్ పై చర్చించడానికి శనివారం ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం అవుతారు.. ఈ క్రమంలోనే శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల సలహా, అభిప్రాయాలను, సూచనలను తీసుకోనున్నారు.కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పై ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com