బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు హత్య కేసులో మాజీ సైనిక కెప్టెన్ ఉరితీత

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు హత్య కేసులో మాజీ సైనిక కెప్టెన్ ఉరితీత

బంగ్లాదేశ్ మాజీ సైనిక కెప్టెన్ అబ్దుల్ మాజిద్‌ను బంగ్లా ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి ఉరితీసింది. 1975 బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటులో ఆయన హస్తం ఉందని.. బంగ్లాదేశ్ జాతిపిత, షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రి, ఆయన కుటుంబ సభ్యులు 1975 ఆగస్టు 15 న హత్యకు గురయ్యారు.

అయితే.. 1998లో ఈ హత్యలో అబ్దుల్ మాజిద్‌ తో పాటు మరో 12 మంది హస్తముందని బంగ్లా సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కానీ. అప్పటికే ఆయన పరారీలో ఉన్నారు. 1996 మాజిద్‌ భారత్ కు వచ్చారనే వార్తలు వినిపించాయి.

అయితే గత నెలలో ఆయన తిరిగి బంగ్లాకు వెళ్లిపోయాడు. వారం రోజుల క్రితం.. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షమాభిక్ష ప్రసాదించాలంటూ బంగ్లా అధ్యక్షుడును కోరాడు. కానీ లాభం లేకుండాపోయింది. హత్య జరిగిన నాలుగున్నర దశాబ్దాల తరువాత శనివారం అర్ధరాత్రి 12.01 గంటలకు ఢాకాలోని జైలులో మాజీద్‌ను ఉరితీశాఋ.

Tags

Read MoreRead Less
Next Story