భారత్ లాక్‌డౌన్ పొడిగింపు పై ప్రపంచ బ్యాంక్ పరేషాన్..

అసలే భారతదేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. దానికి తోడు ఈ కోవిడ్-19 ఒకటి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లైంది పరిస్థితి. ఇదే విషయంపై ప్రపంచ బ్యాంకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2021 లో భారత వృద్ధి రేటు 2.8కి కుదించుకుపోనుందని అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రభావాన్ని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ ప్రతికూల ప్రభావాన్ని మరింత తీవ్రం చేసిందని సౌత్ ఏషియా ఎకనామిక్ అప్‌డేట్ నివేదిక పేర్కొంది. లాక్‌డౌన్ పొడిగిస్తే ప్రపంచ బ్యాంకు అంచనాల కంటే కూడా ఆర్ధిక పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రతికూలతల నేపథ్యంలో దేశీయ పెట్టుబడుల్లో జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంటుందని అంటోంది. అయితే 2022 కల్లా కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి వృద్ధి రేటు 5 శాతానికి పుంజుకునే అవకాశం ఉండొచ్చనే ఆశాభావం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com