ఏపీలో 427 కు చేరిన కరోనా కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. నిత్యం పదికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 427 కు చేరింది. గుంటూరులో 7 , నెల్లూరులో 4 , కర్నూల్ లో రెండు, చిత్తూరు, కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. మరణాల సంఖ్య 7 కు చేరింది. కరోనా సోకి తాజాగా ఒకరు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక ఇప్పటివరకూ 12 మందిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
ఇక పాజిటివ్ కేసులలో గుంటూరు, కర్నూలు జిల్లాలు పోటీ పడుతున్నాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 పాజిటివ్ కేసులు నమోదసు కాగా గుంటూరు జిల్లాలో 82 కేసులు నమోదు అయ్యాయి. ఇక నెల్లూరు జిల్లాలో 52 కు చేరాయి.. ప్రకాశంలో 41 , కృష్ణా జిల్లాలో 35 , కడప జిల్లాలో 31 , పచ్చిమగోదావరి జిల్లాలో 22 , చిత్తూరు జిల్లాలో 21 , తూర్పు గోదావరి జిల్లాలో 17 , విశాఖ జిల్లాలో 20 , అనంతపురం జిల్లాలో 15 కేసులు నమోదు అయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com