ఏపీలో 432 కు చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరిగాయి.. నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 8, చిత్తూరు లో 2, కృష్ణ మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక కేసు నమోదయ్యాయి కొత్తగా నమోదైన 12 కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 432 కి పెరిగింది. మరోవైపు జిల్లాల వారీగా చూసుకుంటే.. గుంటూరులో అత్యధికంగా 90 కేసులు గుంటూరులో నమోదు కాగా.. కర్నూలు జిల్లాలో 84 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక నెల్లూరు జిల్లాలో 52 కు చేరాయి.. ప్రకాశంలో 41 , కృష్ణా జిల్లాలో 36 , కడప జిల్లాలో 31 , పచ్చిమగోదావరి జిల్లాలో 23 , చిత్తూరు జిల్లాలో 23 , తూర్పు గోదావరి జిల్లాలో 17 , విశాఖ జిల్లాలో 20 , అనంతపురం జిల్లాలో 15 కేసులు నమోదు అయ్యాయి.

Tags

Next Story