తగ్గిపోయిందనుకుంటే మళ్లీ వస్తోంది.. తల పట్టుకుంటున్న కొరియా

తగ్గిపోయిందనుకుంటే మళ్లీ వస్తోంది.. తల పట్టుకుంటున్న కొరియా

కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తులను 14 రోజులు క్వారంటైన్‌లో వుంచి చికిత్స అందించి పూర్తిగా తగ్గింది అనుకున్నాక ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడైనా అలానే జరుగుతోంది. కానీ చిత్రంగా దక్షిణ కొరియాలో రెండవ సారి కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య సోమవారం వరకు 51 ఉంటే అది ఇప్పుడు 91కి చేరుకుంది. దేశంలో దాదాపు 7వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఒక్కసారి కోవిడ్ సోకిన వారిలో యాంటీ బాడీలు పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు ఇంత కాలం భావించారు. దానికి విరుద్ధంగా వైరస్ మళ్లీ ఆ వ్యక్తులపై ప్రభావం చూపిస్తుండడంతో వైద్యాధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండోసారి వైరస్ అటాకర్ల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనమని కొరియన్ యూనివర్సిటీ గురో ఆస్పత్రికి చెందిన అంటు వ్యాధుల ప్రొఫెసర్ కిమ్ వూ జూ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story