ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు.. స్థానికుల గుండెల్లో కరోనా గుబులు

ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు.. స్థానికుల గుండెల్లో కరోనా గుబులు

ఇంతకు ముందు ఏ చిన్న బాక్సో లేక కవరో చూస్తే.. అందులో బాంబు ఉందేమోనని అనుమానించేవారు. ప్రస్తుతం కరోనా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో రోడ్డు మీద కరెన్సీ నోటు కనిపిస్తే కూడా దానికి కరోనా వైరస్ అంటుకుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆకతాయిలు కావాలనే స్థానికులను భయపెడుతున్నారు అని అంటున్నారు పోలీసులు. తాజాగా బీహార్‌లో జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

హతియగాచి ప్రాంతంలోని ప్రజలు శనివారం ఉదయం లేచి చూసేసరికి ఇళ్లముందు 20,50,100 రూపాయల కరెన్సీ నోట్లు కనిపించాయి. వాటితో పాటు ఓచిన్న స్లిప్ కూడా అంటించారు ఆ నోట్లకి. నేను కరోనాతో వచ్చాను. నన్ను తీసుకుంటారా లేక మిమ్మల్ని వేధించమంటారా అని రాసి ఉంది వాటి మీద. దీంతో భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కరెన్సీ నోట్లను స్వాధీన పరచుకున్నారు. కరోనా సంక్రమణ వ్యాప్తికి కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ విధంగా కరెన్సీ నోట్లు రోడ్డు మీద కనిపించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story