12 April 2020 10:53 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / ఆకాశంలో...

ఆకాశంలో చోటుచేసుకోనున్న మరో అద్భుతం 

ఆకాశంలో చోటుచేసుకోనున్న మరో అద్భుతం 
X

ఏప్రిల్ నెలలో ఆకాశంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్‌ 7న పింక్‌ సూపర్‌ మూన్‌ని దర్శనమివ్వగా.. తాజాగా మరో ఖగోళ సంఘటన జరగనుంది. చంద్రుడితో గురుడు, శని, అంగారక గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. ఈ ఖగోళ సంఘటన ఏప్రిల్‌ 14, 15, 16వ తేదీల్లో జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వాటితో పాటు ఈ సారి చంద్రుడు కూడా అదే వరుసలో కనిపించనున్నాడు. ఏప్రిల్‌ 14, 15, 16వ తేదీల తర్వాత అంగారక గ్రహం వీటి నుంచి దూరంగా కదులుతుంది. అయితే ఈ మూడు రోజులు చంద్రుడిని గమనిస్తే.. సమీపంలోనే ఆ మూడు గ్రహాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాలుష్య తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో బైనాక్యులర్స్‌, టెలిస్కోప్‌ సాయం లేకుండానే ఆ అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Next Story