క‌రోనాతో ట్రంప్ ఫ్రెండ్ మృతి

క‌రోనాతో ట్రంప్ ఫ్రెండ్ మృతి

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఫ్రెండ్ స్టాన్లీ చెరా.. క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో క‌న్నుమూశారు. 78 ఏళ్ల స్టాన్లీ చెరాకు న్యూయార్క్ సిటీ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రంప్‌కు చెందిన రిప‌బ్లిక‌న్ పార్టీకి కూడా స్టాన్లీ భారీ విరాళాలు అందించారు. క్రౌన్ అక్వీసీషన్స్‌ పేరుతో ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. న్యూయార్క్ న‌గ‌రంలో అనేక భారీ భ‌వంతుల‌ను ఈ సంస్థ నిర్మించింది. సెయింట్ రీజిస్ న్యూయార్క్‌, కార్టియ‌ర్ మ్యాన్‌స‌న్ లాంటి బ‌హుళ అంత‌స్తుల‌ను స్టాన్లీ నిర్మించారు. ట్రంప్ ప్ర‌చారం కోసం స్టాన్లీ సుమారు 4 ల‌క్ష‌ల డాల‌ర్లు విరాళం ఇచ్చారు. ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్న‌ర్‌తోనూ స్టాన్లీకి అనేక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. గ‌త ఏడాది న్యూయార్క్‌లో జ‌రిగిన వెట‌రన్స్ డే ప‌రేడ్‌లోనూ స్టాన్లీని త‌న ప్రాణ స్నేహితుడంటూ ట్రంప్ ప‌రిచ‌యం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story