హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన బ్రిటన్ ప్రధాని

X
కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడి చివరికి ఐసీయూలో సైతం చికిత్స తీసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఏప్రిల్ 5న ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తరువాత ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్ అందించారు. పరిస్థితి మెరుగుపడటంతో జాన్సన్ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు. కోలుకున్న అనంతరం ఆదివారం ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కొద్దిరోజుల పాటు బోరిస్ బకింగ్హామ్షైర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటారని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సెయింట్ థామస్ హాస్పిటల్లో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్ హెల్త్ స్టాఫ్కు జీవితాంతం రుణపడి ఉంటానని బోరీస్ పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
