ఇంట్లో మెట్లకింద ఏకంగా 47 నాగు పాములు..

మామూలుగానే నాగుపాము కంటపడితే గుండె అదురుతుంది.. అలాంటిది పదుల సంఖ్యలో ఇలాంటి పాములు ఒకేచోట కనబడితే ఇంకేమైనా ఉందా? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 47 నాగుపాములు ఓ ఇంట్లో కనిపించాయి.. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది.

గ్రామానికి చెందిన కొంక లచ్చల్‌ అనే వ్యక్తి తన ఇంటిని శుభ్రం చేసేందుకు పాత సామాగ్రిని తొలగిస్తున్నారు.. ఈ క్రమంలో మెట్లకింద ఉన్న పాత సామగ్రిని తీస్తుండగా ఒక్కసారిగా 47 పాములు కనిపించాయి.. అవి నాగు పాములుగా గుర్తించారు.. ఈ క్రమంలో ఒకేసారి అన్ని పాములు పాకుతూ కనిపించడంతో భయాందోళకు గురైన లచ్చల్‌, ఇరుగుపొరుగు వారి సాయంతో వాటిని చంపేశాడు. కాగా ఈ పాములు అక్కడే పుట్టినట్టు వారు తెలుసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story