లాక్‌డౌన్: రాష్ట్రాలకు కీలక సూచనలు చేస్తూ కేంద్రం నుంచి లేఖలు

రాష్ట్రాలకు పలు సూచనలు చేస్తూ.. కేంద్రం లేఖలు రాసింది. లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు, ఇరత వస్తువులతో వెళ్లే ట్రక్కుల రవాణా సాఫీగా జరిగేలా చూడాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. కొన్న ట్రక్కులు తిరుగు ప్రయాణంలో సరుకులు తీసుకొని రావలసి ఉంటుందని.. అందుకు ఖాళీగా వెళ్లే ట్రక్కులు కూడా అనుమతించాలని తెలిపింది. సరుకు రవాణా ట్రక్కులకు ఎటువంటి పాస్‌లు కానీ, పర్మిట్ కానీ అవసరం లేదని స్పష్టం చేశారు.
ట్రక్కు డ్రైవర్లు, క్లీనర్లు తమ ఇళ్లకు సేఫ్‌గా చేరేలా జిల్లా అధికారులు వారికి సహకరించాలని.. ఈ మేరకు లాక్‌డౌన్ నిబంధనల నుంచి మినహాయింపునిస్తూ ఆయా కంపెనీలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే పాస్‌లు అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com