కరోనాతో ఒక్కరోజే 567 మంది మృతి

X
స్పెయిన్లో కరోనా మహమ్మారి విజృభిస్తోంది. ఈ వైరస్ కారణంగా అక్కడ ఇప్పటివరకూ 18,056 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే 567 మంది మృతి చెందారు. అమెరికా, ఇటలీ తర్వాత అత్యధిక కరోనా మరణాలు నమోదైన మూడో దేశం స్పెయినే. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,045 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు స్పెయిన్ ఆరోగ్యశాఖ తెలిపింది. స్పెయిన్లో ప్రస్తుతం వైరస్ సోకిన వారి సంఖ్య 172,541కు చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
