అంతర్జాతీయం

క్వారంటైన్‌లో శ్రియా శరణ్ భర్త..

క్వారంటైన్‌లో శ్రియా శరణ్ భర్త..
X

మొన్నటికి మొన్న లాక్‌డౌన్‌ని ఎంజాయ్ చేస్తున్నాము. మా ఇంటి పని మేమే చేసుకుంటున్నాము అని పోస్ట్ పెట్టింది సినీ నటి శ్రియా. మరి అంతలోనే తన భర్త ఆండ్రూ కొచీవ్‌కు కరోనా లక్షణాలైన పొడిదగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడని పోస్ట్ పెట్టింది. ముందు జాగ్రత్త చర్యగా అతడిని ప్రత్యేక గదిలో ఉంచామని తెలిపింది. అసలే స్పెయిన్‌లో పరిస్థితి బాగాలేదు. ఇప్పటికే వేల మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి సమయంలో తన భర్త అనారోగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తుందని వివరించింది. పరిస్థితిని బట్టి ఆసుపత్రికి తరలిస్తామని పేర్కొంది.

Next Story

RELATED STORIES