విద్యార్థులు సమయం వృధా చేయవద్దు: మంత్రి ఆదిమూలపు సురేష్

విద్యార్థులు సమయం వృధా చేయవద్దు: మంత్రి ఆదిమూలపు సురేష్
X

పదవ తరగతి విద్యార్థులు సమయం వృధా చేయవద్దని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు. కరోనా కట్టడికి మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించడంతో ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలు మరోసారి వాయిదా పడ్డాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ పడవ తరగతి పరీక్షలు గురించి మాట్లాడిన ఆదిమూలపు సురేష్ లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను ప్రస్తుతం నిర్వహించలేకపోతున్నామని వెల్లడించారు. పరీక్షలు జరిగే వరకూ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు చెప్పించే ఏర్పాటు చేశామని..విద్యార్థులు సమయాన్ని వృధా చేయవద్దని కోరారు. ఉదయం 10-11, సాయంత్రం 4-5 ఇవి ప్రసారం అవుతాయని సురేష్ వెల్లడించారు.

అవే క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్‌లో కూడా చూడొచ్చని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌లో చెప్పడానికి ఉత్సాహం ఉన్న ఉపాధ్యాయలు కూడా ముందుకు రావచ్చని ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Tags

Next Story