కరోనా: ఐసియులో వృద్ధ దంపతులకు వివాహ వార్షికోత్సవం

కరోనా: ఐసియులో వృద్ధ దంపతులకు వివాహ వార్షికోత్సవం

ప్రపంచవ్యాప్తంగా కరోనా స్వైరవిహారం చేస్తుంది. దీని బారిన పడినవారి సంఖ్య 20 లక్షలకు చేరువలో ఉంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే సామాజిక దూరం పాటించటం తప్ప వేరే మార్గం లేక.. అందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ప్రజలు, ప్రభుత్వాలు అన్ని కార్యక్రమాలని వాయిదా వేసుకుంటున్నాయి. అయితే.. కరోనా సోకినా సుమారు 20 లక్షల మంది మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాగే కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి వృద్ధ దంపతులకు ఆస్పత్రి వర్గాలు వివాహ వార్షికోత్సవం జరిపారు. ఈ ఆసక్తికార సంఘటన ఇటలీలోని మార్ష్ ప్రావిన్స్‌లో గల ఫెర్మో సిట్యువేషన్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. కరోనా సోకి ఐసియులో చికిత్స పొందుతున్నారు. భర్త జియాంకాలాస్ వయసు 73 సంవత్సరాలు కాగా.. అతని భార్య వయసు 71 ఏళ్ళు. వారి వివాహం జరిగి 50 ఏళ్ళు నిండుకున్నాయని తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది వారితో కేకే కట్ చేపించి వివాహ గీతాన్నిప్లే చేశారు. తరువాత అక్కడ జరిగిన కార్యక్రమానికి సంబందించిన ఫోటోలను వారి పిల్లలకి కూడా పంపించారు. అనంతరం ఆస్పత్రి సిబ్బంది మీడియాతో మాట్లాడి విషయాన్ని తెలియజేసారు. భర్త జియాంకాలాస్ గురించి భార్య ఆందోళన చెందుతుందని.. కన్నీళ్లు కూడా పెట్టుకుందని తెలిపారు. అయితే.. ఈ సంఘటనపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం వృద్ధ దంపతులకు ఆత్మస్తైర్యం నింపుతుందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story