డేంజర్ స్టేజ్ కి చేరిన కర్నూల్ జిల్లా

113 కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా డేంజర్ స్టేజికి వెళ్ళింది. ఒక్క కర్నూలు సిటీలోనే 50 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు కర్నూలు తోపాటు గద్వాల జిల్లాలో అధికారులకు కొత్త సమస్య వచ్చి పడింది. కర్నూలులో ప్రముఖ వైద్యుడు కరోనాతో చనిపోయాడు. అంతకుముందు అతను తన ఆసుపత్రిలో కర్నూలు, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వందలాది మందికి చికిత్స అందించినట్టు తెలుస్తోంది. దీంతో వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.
ఇదిలావుంటే ఏపీలో నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కృష్ణ లో 3, కర్నూల్ లో 3, పశ్చిమ గోదావరి లో 3 కేసు లు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9 కేసుల తో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 534 కి పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com