చైనా చెప్పట్లేదు కానీ.. మరణాల సంఖ్య చాలా..: ట్రంప్

చైనా చెప్పట్లేదు కానీ.. మరణాల సంఖ్య చాలా..: ట్రంప్

కరోనా మహమ్మారి చైనాలో పుట్టి ప్రపంచమంతా విస్తరించింది. రోజూ ప్రపంచం మొత్తంలో వందల కొద్దీ మరణాలు, వేలకొద్దీ పాజిటివ్ కేసులు.. ఆ సంఖ్య లెక్కకు అందకుండా ఉంది. ఈ నేపథ్యంలో మా దేశంలో మరణించిన వారి సంఖ్య ఇంతే అని తప్పుడు లెక్కలు చెబుతోంది అని అగ్రరాజ్యం అమెరికా చైనాపై విరుచుకుపడుతోంది. వూహాన్‌లో పుట్టిన ఈ కరోనా వైరస్‌ని సమూలంగా రూపుమాపాం అని అంటున్నా మళ్లీ విదేశీయుల రాకపోకలతో అక్కడ కూడా పాజిటివ్ కేసులతో పాటు, మరణాలు సంభవిస్తున్నాయి.

ఇవేవి పైకి చెప్పకుండా మరణాల సంఖ్య తగ్గిపోయిందని చెబుతున్న చైనా, ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్ విరుచుకుపడుతున్నారు. యూస్‌లో కరోనా మరణాలకంటే చైనాలో సంభవించిన మరణాల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని ఆయన ఆరోపిస్తున్నారు. ముందు నుంచి చైనీయులు ఈ కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయకుండా దాచారని అది ఇప్పుడు అందరి కొంప ముంచుతుందని అధినేత ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story