పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 25 వరకే !

మెడికల్, డెంటల్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నీట్లో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు వైద్యారోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. శనివారం నుంచి ఏప్రిల్ 25 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం తెలిపింది. దరఖాస్తుతోపాటే సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ సమయంలోనే అన్ని ధ్రువపత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
