26 మంది నేవీ సిబ్బందికి కరోనా

26 మంది నేవీ సిబ్బందికి కరోనా
X

దేశంలో కరోనా వైరస్ కేసులు మోజు రోజుకు పెరుగుతున్నాయి. వీరిలో కొంతమంది వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బందికి చెందిన వాయు మహమ్మారి భారిన పడ్డారు. తాజాగా భారత నావికాదళానికి చెందిన 26 మంది సిబ్బందికి ముంబైలోని నావికాదళ ప్రాంగణంలో కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది . ఐఎన్‌ఎస్‌ ఆంగ్రే పరిసరప్రాంతాల్లో ఉన్న వారందరికీ కోవిడ్‌ పరీక్షలు జరిపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయాలను రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఇతర ఉన్నతాధికారులకీ తెలియజేశారనీ, వారు ఈ పరిస్థితిపై దృష్టిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు.

ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, శనివారం రాత్రి 9 గంటల నాటికి, భారతదేశం మొత్తం 2,154 కొత్త కోవిడ్ -19 కేసులను నివేదించింది. ఏప్రిల్ 18, రాత్రి 9 నాటికి 3,54,969 మంది వ్యక్తుల నుండి మొత్తం 3,72,123 నమూనాలను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. శనివారం మొత్తం 35,494 నమూనాలను నివేదించినట్లు తెలిపింది.

Tags

Next Story