ఇంటి గోడలో 63 పాములు.. వంద గుడ్లు..

X
By - TV5 Telugu |19 April 2020 3:04 AM IST
ఎండ వేడి తాళలేక ఎక్కడ ఉన్న పాములన్నీ బయటకు వస్తున్నాయి. కామారెడ్డి ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భూమయ్య కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నాడు. వారి ఇంటి గోడకు ఉన్న రంధ్రం ద్వారా పాము ఒకటి బయటకు రావడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే భీమయ్య చుట్టుపక్కల వారినందరినీ పిలిచి పామును చంపేశాడు. గోడ కూడా పగల గొట్టారు స్థానికులు. ఇంకేమైనా పాములు ఉన్నాయేమో చూద్దామని.. ఒకటీ రెండూ కాదు ఏకంగా పాముల గుట్ట కనిపించింది. మొత్తం 63 పాములు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వందకు పైగా పాము గుడ్లు కూడా కనిపించాయి వారికి. పాములన్నింటినీ చంపేసి గుడ్లను ధ్వంసం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com