లాక్‌డౌన్ కష్టాలు.. 40 మంది పెళ్లి వాళ్లు.. నెల రోజుల నుంచి ఒకే ఇంట్లో..

లాక్‌డౌన్ కష్టాలు.. 40 మంది పెళ్లి వాళ్లు.. నెల రోజుల నుంచి ఒకే ఇంట్లో..
X

బంధువులొస్తే బాగానే ఉంటుంది. నాలుగు రోజులు వుండి వెళ్తే ఫరవాలేదు. పైగా వచ్చింది నలుగురు కూడా కాదు సంతోష పడడానికి.. 40 మంది. పెళ్లికని వచ్చారు. పెళ్లి వాళ్లింట్లోనే ఉండి పోయారు. వాళ్లకి రోజూ వండి వార్చలేక, పడుకోవడానికి సరైన సదుపాయాలు కల్పించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు బొల్లారంకు చెందిన వరుడి కుటుంబ సభ్యులు. ఐడీఏ బొల్లారానికి చెందిన యువకుడికి ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన యువతితో మార్చి 20న వివాహమైంది.

వధువు తరపు వాళ్లు మొత్తం 40 మంది వచ్చారు. వివాహ వేడుకల అనంతరం స్వస్థలానికి వెళ్లడానికని మార్చి 23న టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ లాక్‌డౌన్ కారణంగా వారంతా వరుడి ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. నెల రోజులుగా వారికి సదుపాయాలు కల్పించలేక అవస్థలు పడుతున్నారు వరుడి కుటుంబసభ్యులు. ప్రత్యేక అనుమతి ఇచ్చి తమను ఒడిశాకు పంపాలని అధికారులను కోరుతున్నారు వధువు కుటుంబ సభ్యులు. ఈ మేరకు వారి విజ్ఞప్తిని స్వీకరించిన బొల్లారం సీఐ ప్రశాంత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

Tags

Next Story